24న జాబ్ మేళా
హన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల ఎంపికకు ఈనెల 24న (శనివారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దృవత్ సొల్యూషన్స్‌లో టెలీకాలర్, సాటిన్ ఫైనాన్స్‌లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫైన్ ఫ్రీలో టెలీకాలర్స్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, విజయ ఫర్టిలైజర్స్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, క్యాప్ట్సన్ హైదరాబాద్‌లో ఐటీ అసెట్స్ ఆపరేషన్ పోస్టులకు 50 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. అభ్యర్థులు 18 – 35 వయసు కలిగి ఉండి ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 24న వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంప్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 7893394393 నంబర్‌లో సంప్రదించాలని వివరించారు.
మణుగూరు ఎక్స్‌ప్రెస్‌కు
కారేపల్లిలో ప్రయోగాత్మక హాల్టింగ్
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని డోర్నకల్–భద్రాచలంరోడ్ మధ్య గల కారేపల్లి రైల్వే స్టేషన్‌లో జనవరి 21వ తేదీ నుంచి కాజీపేట మీదుగా ప్రయాణించే సికింద్రాబాద్–మణుగూరు ఎక్స్‌ప్రెస్‌కు ప్రయోగాత్మక హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది.
మదార్‌కు విశిష్ట్ రైల్
సేవా పురస్కారం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీని యర్ సెక్షన్ ఇంజనీర్ (ఎస్ ఎస్‌ఈ) ఎస్.కె.మదార్ విశి ష్ట్ రైల్‌సేవా పురస్కార్–20 25 అవార్డుకు ఎంపికయ్యారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ అభివృద్ధికి కృషి చేసిన నేపథ్యంలో మదార్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 29వ తేదీన సికింద్రాబాద్ రైల్‌నిలయంలో జరిగే 70వ రైల్వే వీక్ అవార్డు కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చేతుల మీదుగా మదార్ ఈ పురస్కారం అందుకుంటారు. మదార్ గతంలో 2015లో రైల్వే జీఎం అవార్డు అందుకున్నారు. ఇప్పుడు రెండోసారి విశిష్ట్ రైల్ సేవా పురస్కార్ అవార్డుకు ఎంపికై నందుకు మ దార్‌ను రైల్వే అధికారులు అభినందిస్తున్నారు.


