వడ్డీలేని రుణాలను త్వరగా పంపిణీ చేయండి | - | Sakshi
Sakshi News home page

వడ్డీలేని రుణాలను త్వరగా పంపిణీ చేయండి

Jan 20 2026 8:32 AM | Updated on Jan 20 2026 8:32 AM

వడ్డీలేని రుణాలను త్వరగా పంపిణీ చేయండి

వడ్డీలేని రుణాలను త్వరగా పంపిణీ చేయండి

వీసీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మహబూబాబాద్‌: వడ్డీలేని రుణాల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌తో కలిసి వడ్డీలేని రుణాలు, తదితర విషయాలపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పట్టణాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement