సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి
● డీజీపీ శివధర్‌రెడ్ది
మామునూరు: టీజీఎస్పీ బెటాలియన్ అధికారులు, సిబ్బంది తమ పనితీరు మరింతగా మెరుగు పరుచుకోవాలని డీజీపీ బి. శివధర్‌రెడ్డి, టీజీ ఎస్పీ అదనపు డీసీపీ సంజయ్ కుమార్ జైన్ సూచించారు. ఈ మేరకు ఆదివారం వరంగల్ మామునూరులోని టీజీ ఎస్పీ బెటాలియన్‌ను వారు సందర్శించారు. బెటాలియన్ ప్రాంగణంలో నిర్మించిన నివాస సముదాయాలను ప్రారంభించారు. ఈసందర్భంగా బెటాలియన్ పరిసరాలను పరిశీలించి నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ వ్యయంతోనే మెరుగైన వసతులు కల్పించిన అధికారులను అభినందించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ టీజీ ఎస్పీ సిబ్బంది విధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్ సీపీ సన్‌స్రీత్ సింగ్, ఏసీ కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్‌రావు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
డీజీపీని కలిసిన సీపీ సన్‌ప్రీత్
వరంగల్ క్రైం : మామునూరు నాలుగో బెటాలియన్ అధికా రులు, సిబ్బంది కోసం నిర్మించిన గృహ సముదాయంతో పాటు బ్యాడ్మింటన్ క్రీడ ఆడిటోరియాన్ని ప్రారంభించేందుకు ఆదివారం విచ్చేసిన డీజీపీ బి. శివధర్ రెడ్డిని సీపీ సన్ ప్రీత్ సింగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్క అందజేశారు. డీజీపీని కలిసిన వారిలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, మామునూరు ఏసీపీ వెంకటేష్, సిబ్బంది ఉన్నారు.
సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి


