సాధారణ ప్రసవాలు పెరగాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: జిల్లాలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. మాతాశిశు సంరక్షణ, క్షయవ్యాధి నియంత్రణపై గురువారం సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భందాల్చిన వారికి సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలను వివరించి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని బయ్యారం, కొత్తగూడ, గూడూరు, డోర్నకల్, తొర్రూరు దంతాలపల్లి, నెల్లికుదురు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల ప్రోత్సాహక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గితే చర్యలు తప్పవని వైద్యాధికారులను హెచ్చరించారు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో తెమడ పరీక్ష చేయాలని, టీబీ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే పూర్తి చికిత్సను అందించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు సారంగం, విజయ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, ప్రత్యూష, డెమో ప్రసాద్, హెచ్‌ఈ రాజు, గీత, పురుషోత్తమ్, శారద, రామకృష్ణ, స్వామి, డీపీఓ నీలోహన, ప్రోగ్రాం అధికారి నీలిమాశ్వేత, అశోక్, నర్సింగ్ ఆఫీసర్స్, సూపర్‌వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
మరిపెడ రూరల్: విద్యార్థులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాఽథోడ్ అన్నారు. గురువారం మరిపెడ మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి క్రీడోత్సవాల వద్ద మరిపెడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపును డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరిపెడ పీహెచ్‌సీ వైద్యుడు గుగులోతు రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


