బిర్సాముండా జయంతి ఘనంగా నిర్వహించాలి
మహబూబాబాద్: గిరిజన వీరుడు బిర్సాముండా జయంతిని ఘనంగా నిర్వహించాలని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ మహేష్‌ఠాకూర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల అధి కారులతో బిర్సా ముండా జయంతి ఉత్సవాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌ఠాకూర్ మాట్లాడుతూ.. బిర్సాముండా భారత స్వాతంత్య్ర పో రాటంలో అత్యంత ముఖ్యమైన గిరిజన నాయకుడన్నారు. చిన్నవయసులోనే గిరిజన ప్రజల బాధలను, ఆంగ్లేయుల అణచివేతను గమనించారన్నారు. ఆంగ్లేయుల భూ విధానాలకు వ్యతి రేకంగా పోరాటం చేశారన్నారు. భారత ప్రభుత్వం ఈనెల 15న జన్‌జాతీయ గౌరవ్ పఖ్ వారా కార్యక్రమం నిర్వహిస్తుందన్నా రు. 15వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థల్లో బిర్సా ముండా జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. వీసీ లో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీరాం, సంబంఽధిత అధికారులు పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
తొర్రూరు: తొర్రూరు బస్ డిపో పరిధిలో నేడు (శుక్రవారం) ఉదయం 11నుంచి 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం పద్మావతి తెలిపారు. వివిధ మార్గాల్లో కొత్త బస్సు సర్వీసుల కేటాయింపు, వేళల్లో మార్పులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు, సంస్థ ఉన్నతికి చేపట్టాల్సిన చర్యలపై ప్రజలు నేరుగా తమ సూచనలు, సలహాలు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఆసక్తిగల వారు 9959226053 ఫోన్ నంబర్‌లో నిర్ణీత సమయంలో ఫోన్ చేయాలని సూచించారు.
డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్ బదిలీ
మహబూబాబాద్: డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేస్తూ ఆశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కార్యాలయం అధికారులు గురువారం తెలిపారు. ఏఎస్‌ఓగా పని చేస్తున్న జాటోత్ రమేశ్‌కు డీసీఎస్‌ఓగా బాధ్యతలు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు.
పారిశుద్ధ్య పనుల్లో
నిర్లక్ష్యం వద్దు
దంతాలపల్లి: గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని డీఎల్‌పీఓ పుల్లారావు అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి తాగునీరు అందించాలని, డ్రెయినేజీల్లో మరుగు నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతీ వీధిలో బ్లీచింగ్ చల్లించాలని, అలాగే వీధుల్లో చెత్త లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్‌పాషా, కార్యదర్శి సృజన, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
9న బాలల కళల
సంబురాల జాతర
హన్మకొండ కల్చరల్: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 9న హనుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ వరంగల్ ఆధ్వర్యంలో ఓరుగల్లు చిల్డ్రన్ అవార్డు–2025 బాలల కళల సంబురాల జాతర జరగనుంది. ఈ మేరకు గురువారం జాతర పోస్టర్‌ను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్వహకులు జడల శివ, హరిత, ప్యాడ్ విజయ్, సింగర్ చైతన్య, దాసరి రాజు, శిరబోయిన రాజు, ఆనంద్ పాల్గొన్నారు.
బిర్సాముండా జయంతి ఘనంగా నిర్వహించాలి
బిర్సాముండా జయంతి ఘనంగా నిర్వహించాలి


