జువైనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు
● జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలో నూతనంగా జువైనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు చేయనున్నామని జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడు తూ.. జిల్లాలో నూతనంగా ఏర్పాటుకానున్న జువైనల్ జస్టిస్ బోర్డు కార్యకలాపాలు జిల్లా కేంద్రంలోని బాలరక్ష భవనంలో కొనసాగుతాయని, ఈ బోర్డుకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నా రు. ప్రతీ గురువారం జువైనల్ జస్టిస్ బోర్డులో జడ్జి కృష్ణతేజ్ విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. 18 సంవత్సరాలలోపు వయసు గల బాలలు నేరం చేసినట్లయితే వారిని నేరస్తులుగా కాకుండా, చట్టంతో ఘర్షణపడిన వారిగా గుర్తించి జువనైల్ జస్టిస్ బోర్డు ద్వారా విచారిస్తారన్నారు. బాలలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి జువైనల్ జస్టిస్ బోర్డు వద్ద ఐదుగురు న్యాయవాదులతో కూడిన న్యాయ సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 15న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించాలని పోలీసులకు సూచి ంచారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని షాకెల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్ పాల్గొన్నారు.
జువైనల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు


