కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు

Nov 4 2025 8:16 AM | Updated on Nov 4 2025 8:16 AM

కలెక్

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు

మహబూబాబాద్‌: కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పా టు చేసేందుకు పనులు చేస్తున్నారు. కలెక్టరేట్‌లో ఏటా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టరేట్‌ అధికారులు పేర్కొన్నారు.

ఉద్యాన కళాశాల ఏర్పాటుపై సర్వే

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలం మల్యాల గ్రామంలో ఉద్యాన కళాశాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, అధికారులు జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం పరిధిలోని భూమిని మల్యాల రెవెన్యూ గ్రామానికి సంబంధించిన రికార్డు, గ్రామనక్షా, పహాణీ సహాయంతో డీజీపీఎస్‌ పరికరం ద్వారా సర్వే చేశారు.

ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

నెహ్రూసెంటర్‌: దుష్ఫలితాలు లేని హోమియో మందులను ప్రజలు ఆదరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ సూచించారు. ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో హోమియో వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. వైద్య శిబిరంలో 200 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు. ఈ శిబిరంలో డాక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌, శ్రీకాంత్‌, మాధవి, క్యాంపు ఇన్‌చార్జ్‌ రామకృష్ణ, చైతన్య, మమత, ప్రీతి, శ్రేయ, వంశీ, డీఎంఓ శ్రవణ్‌, మేరీ, దీవెన, పద్మ, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను ట్రాక్టర్‌లో తీసుకెళ్లిన ఉపాధ్యాయులు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలోని వీఎస్‌.లక్ష్మీపురం గ్రామ కొత్తచెరువు అలుగుపోస్తుంది. కాగా, సోమవారం రోడ్డుపై నుంచి ప్రవాహం కొనసాగడంతో జంగిలిగొండ, వీఎస్‌.లక్ష్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో చుట్టు పక్కల తండాలు, గ్రామాల విద్యార్థులు లక్ష్మీపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లలేకపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్‌ఎం జానకీరాములు, ఉపాధ్యాయులు 20 మంది విద్యార్థులను ఓ ట్రాక్టర్‌ ద్వారా ఉదయం పాఠశాలకు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మళ్లీ అదే ట్రాక్టర్‌లో విద్యార్థులను తీసుకొచ్చి వారి ఇళ్లకు పంపించారు. కాగా, వర్షం కురిసిన ప్రతీసారి వీఎస్‌.లక్ష్మీపురం, జంగిలిగొండ గ్రామాల మధ్య కొత్తచెరువు అలుగుపోసి వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోతున్నాయని, ఆ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రైతులు, ప్రజలు కోరారు.

కేయూ ప్రైవేట్‌ కళాశాలల బంద్‌

కేయూ క్యాంపస్‌: ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకా యిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కేయూ పరిఽధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌పీజీ కళాశాలలు, ప్రొఫెషనల్‌ కళాశాలలు సోమవారం నుంచి నిరవధికంగా బంద్‌ చేశారు. ఎక్కువశాతం ప్రైవేట్‌ కళాశాలలు ముందుగా నే విద్యార్థులకు సమాచారం ఇవ్వడంతో కళా శాలలకు రాలేదు. అక్కడక్కడ వచ్చినా కళాశాలలు మూసివేసి ఉండడంతో విద్యార్థులు వెనుదిరిగారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు1
1/3

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు2
2/3

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు3
3/3

కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement