దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరి ష్కారం కాకుంటే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పలువురు దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వచ్చినా వినతులు తీసుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రజావాణిలో 89 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో మానుకోట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా సేవలు అందించిన వారిలో కొంత మంది మృతి చెందారని, వారి స్థానంలో కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని వినతి ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాగన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
ప్రజావాణిలో 89 వినతులు
సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు దివ్యాంగుల ఆవేదన

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
