టీఆర్‌లలో హస్తం ఉన్న పెద్దలపై చర్యలేవి?
● వ్యవసాయ శాఖ మంత్రికి
కాంగ్రెస్ నేతల ఫిర్యాదు!
వరంగల్: గత సంవత్సరం పత్తి కొనుగోళ్ల కోసం జారీ చేసిన టీఆర్(టెంపరరీ రిజి స్ట్రేషన్)లలో జరిగిన అవకతవకల్లో మా ర్కెటింగ్‌శాఖ వరంగల్ రీజియన్‌లో ఇద్ద రు ఉన్నతాధికారుల హస్తం ఉందని, దీని పై విచారణ జరిపి చ ర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తల పేరు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఓ లేఖను పంపినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌లను జారీ చేసేందుకు ఓటీపీ విధానం తాత్కాలికంగా డీఈ ఓ(డాటా ఎంట్రీ ఆపరేటర్)లతో అమలు చేశారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్లలోని జిన్నింగ్ మిల్లుల వ ద్ద రీజియన్‌లోని డాటా ఎంట్రీ ఆపరేటర్లు తమ ఇ ష్టం వచ్చినట్లు టెంపరరీ రిజిస్ట్రేషన్లు, ఓటీపీ విధానానికి ఒక్కొక్క దానికి రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు ఇచ్చారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పే ర్కొన్నారు. తాత్కాలికంగా నియమించుకున్న వారి ని తొలగించే అధికారం సదరు ఇద్దరు అధికారులకున్నా మినహాయింపు ఇచ్చి, బాధ్యులైన డీఈఓల ను వదిలేసి కార్యదర్శులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. అంతేకాకుండా మిల్లు యజమాను ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధు లకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక్కొక్క మిల్లు నుంచి రూ.25వేలు వసూలు చేశారని ఆరోపించారు. మొత్తం రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు తమ స ర్వే టీం వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. ఈ దందా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈలేఖలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రులు,మంత్రి,ఎమ్మెల్యేలు, మా ర్కెటింగ్‌శాఖ డైరెక్టర్లకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.


