అత్యవసరంలో ఆదుకునే సంస్థ ‘లయన్స్’
హన్మకొండ: అత్యవసర సమయాల్లో ఆదుకునే సంస్థ లయన్స్ ఫౌండేషన్ అని ఆ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా అన్నారు. ఆదివారం హనుమకొండ, వరంగల్ జిల్లాలో ముంపునకు గురైన సమ్మయ్యనగర్, మైసయ్య నగర్, శివనగర్, బెస్తం చెరువు, మరియపురం, తిమ్మాపురం, జక్కలొద్ది, లెనిన్‌నగర్, షాపూర్, వడ్లకొండ, చౌటపల్లి, బొల్లికుంట, ఐనవోలు ప్రాంతాల్లో నష్టపోయిన 450 కుటుంబాలు, ములుగు జిల్లాలోని 200 కుటుంబాలకు రూ.15 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, బ్లాంకెట్‌లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ మూలాన విపత్తు సంభవించినా వెంటనే స్పందించే సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని తెలిపారు. ఈ విపత్తు సాయం నిమిత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎల్‌సీఐఎఫ్ నిధులు మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా వరద ముంపు బాధితులకు నిత్యావసర కిట్, బ్లాంకెట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రెండో ఉప జిల్లా గవర్నర్ పుట్టా హరికిషన్ రెడ్డి, జిల్లా ముఖ్య సలహాదారు, పూర్వ జిల్లా గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాస రావు, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఆర్.ప్రకాశం, కోశాధికారి చల్లా రఘునాథ్ రెడ్డి, ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ డాక్టర్ రాజేశ్వరి, జిల్లా నాయకులు మార్గం ప్రభాకర్, డాక్టర్ సురేశ్ కుమార్, కటంగూరు రాంగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
రూ.15 లక్షల విలువైన సరుకులు అందజేత
లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్
డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా


