ఉడకని అన్నం
నీరు వెళ్లేందుకు పొలంలో కాల్వ తవ్వుతున్న రైతులు
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఉడికీ ఉడకుండా.. నల్ల బియ్యంతో వండిన అన్నం తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిత్యం వసతి గృహాలను జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, అధికారుల
పర్యవేక్షిస్తున్నా మహబూబాబాద్ జిల్లాలోని వసతి గృహాల్లో విద్యార్ధుల ముద్ద అన్నం, నీళ్లచారే
దిక్కవుతోంది.
ఉండలు కట్టిన బియ్యం సరఫరా..
జిల్లాలోని హాస్టళ్లకు, గురుకులాలకు ఉండలు కట్టిన బియ్యం నల్లని బియ్యం సరఫరా అవుతోంది. ఆ బియ్యం వండిన తర్వాత అన్నం ముద్దగా అవుతోందని వంట మనుషులు వాపోతున్నారు. విద్యార్థులు కడుపు నిండా తినలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ‘ఏం పెట్టిన తినాల్సిందే.. ఏదైనా జరిగినా బయటకు రావొద్దు.. ఎవరైనా ఎదురు మాట్లాడితే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాం’ అంటూ విద్యార్థులను వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు వేధిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. జిల్లాలోని కస్తూర్బా, మోడల్ స్కూల్, సాంఘిక, గిరిజన సంక్షేమ, మైనార్టీ, మహత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల వసతి గృహాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, హాస్టళ్లు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నాయి.
కొరవడిన పర్యవేక్షణ
ముద్ద అన్నం తినబుద్ధి కావట్లేదని హాస్టళ్ల విద్యార్థులు వాపోతున్నారు. తినకపోతే తప్పట్లేదని, అన్నం అరగక తరచూ కడుపునొప్పి లేస్తోందని హాస్టళ్ల విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లపై పర్యవేక్షణ కొరవడిందని, ఉన్నతాధికారులు పర్యవేక్షించి హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, భోజనం పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
●
అధికారుల నిర్లక్ష్యం
సంక్షేమ, గిరిజన, మైనార్టీ, బీసీ గురుకులాలు జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక వార్డెన్లు ప్రిన్సిపాళ్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అన్నం దొడ్డుగా అవుతోందని, కూరలు రుచిగా లేవని విద్యార్థులు చెబుతున్నారు. అధికారులు పర్యవేక్షించి తక్షణమే దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
– గుగులోతు సూర్యప్రకాశ్,
డీఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టళ్లలో బియ్యం నల్లగా వస్తున్నాయని, అన్నం వండితే దొడ్డుగా ముద్దగా అవుతోందనే సమస్య మా దృష్టికి వచ్చింది. విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బియ్యం మార్చుకునే అవకాశం కల్పించాలి. పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. – గుగులోతు దేశీరాంనాయక్, జిల్లా గిరిజన శాఖ అధికారి, మానుకోట
నీళ్ల చారుతో భోజనం
సంక్షేమ, వసతి గృహల్లో విద్యార్థులకు
అందని నాణ్యమైన భోజనం
ప్రశ్నిస్తే టీసీ ఇచ్చి పంపిస్తామని
బెదిరింపులు
తినలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
పాఠశాలలు సంఖ్య విద్యార్థులు
సాంఘిక సంక్షేమ,డిగ్రీ గురుకులాలు 6 3,650
ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య 14 6,732
కస్తూర్బా విద్యాలయాలు 16 3,088
మోడల్ స్కూళ్లు 8 5,675
ఎస్సీ హాస్టళ్లు 20 1,521
పోస్ట్‌మెట్రిక్ 4 200
గిరిజన ఆశ్రమ పాఠశాలలు 19 5,677
వసతి గృహాలు 6 615
పోస్ట్‌మెట్రిక్ 9 685
మైనార్టీ గురుకులాలు, కళాశాలలు 6 1,483
బీసీ వసతి గృహాలు 8 680
పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు 6 450
బీసీ మహాత్మా పూలే 6 3,030
ఉడకని అన్నం
ఉడకని అన్నం
ఉడకని అన్నం
ఉడకని అన్నం


