వీరన్న సన్నిధిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

Nov 3 2025 6:34 AM | Updated on Nov 3 2025 6:34 AM

వీరన్

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

రాష్ట్ర స్థాయి ఫుట్‌ బాల్‌ పోటీలకు విద్యార్థులు

కురవి: మండలంలోని మోద్గులగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 1వ తేదిన డోర్నకల్‌లోని బిషప్‌ గ్రౌండ్‌లో అండర్‌–14 ఎంపిక పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎన్‌.జె.చరణ్‌, ఐలి సౌజన్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ చారి, పీడీ దార్ల సునీల్‌ ఆదివారం తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి వికారాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. అభినందించిన వారిలో ఉపాధ్యాయులు శ్రీరాములు, లత, సలీం, ఇందిర, వీరన్న, దీపిక, రజిత, భాగ్యలక్ష్మి, టి.రమేశ్‌, బాలాస్టి రమేశ్‌, లక్ష్మి, జహేదాబేగం, పాఠశాల కమిటీ చైర్‌పర్సన్‌ శారద ఉన్నారు.

నేటినుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంలో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ముడుంబై లక్ష్మీనారాయణాచార్యులు, సత్యంగౌతంశర్మ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి నిత్య ఆరాధన, 9 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, ఋత్విక్‌ వరణం, మృత్సంగ్రహణం, అంకురారోపణ, తీర్థ ప్రసాద గోష్టి పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నిత్య ఆరాధన, 9 గంటల నుంచి మూలమంత్ర, మూర్తి మంత్ర హవనాలు, పవిత్ర న్యాస హవనం, లఘు పూర్ణహుతి, పెరుమాళ్లుకు స్నపనం జరిపి తీర్థప్రసాద గోష్టి పూజలు ఉంటాయని తెలిపారు. బుధవారం ఉదయం నిత్యఆరాధన, ఉత్సవాంగ హవనంతో పాటు పౌర్ణమి సందర్భంగా సుదర్శన హోమం, పూర్ణాహుతి, పవిత్ర ఆరోపణం, మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, విమాన శిఖరానికి, ఆలయం చుట్టూ పవిత్రధారణ చేయటం పూజలు జరుగుతాయన్నారు. అనంతరం లక్ష తులసి అర్చన, కుంభ ప్రోక్షణ, వేద ఆశీర్వచనం, ఉత్సవ కై ంకర్యపరులకు పవిత్ర మాలధారణ, ఋత్విక్‌ సన్మానం, ఉత్సవ సమాప్తి నిర్వహించనున్నట్లు తెలిపారు.

రోడ్డు నిర్మించాలని పూజారుల నిరసన

ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి– ఊరట్టం నుంచి మేడారం వెళ్లే రోడ్డును తక్షణమే నిర్మించాలని గోవిందరాజుల పూజారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, గోవిందరాజుల పూజారులు దబ్బగట్ల గోవర్ధన్‌, రాజారాం, బాబు, జనార్ధన్‌, నాగేశ్వర్‌రావు, మాణిక్యం, చంద్రమౌళి, రాజు, రవి, వెంగళరావు, నాగరాజు ఆదివారం కొండాయి నుంచి ఊరట్టం మీదుగా మేడారం వెళ్లే రోడ్డును పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. కొండాయి బ్రిడ్జితో పాటు రోడ్డు మార్గాన్ని నిర్మిస్తేనే గోవిందరాజులను మేడారం జాతరకు తీసుకొస్తామన్నారు. సరైన రోడ్డు మార్గం లేక గోవిందరాజులును మేడారం తీసుకెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మేడారం మహాజాతరకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా రోడ్లు నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ఈ విషయాన్ని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. జాతరవరకు రోడ్డు నిర్మించకుంటే గోవిందరా జులను జాతరకు తీసుకురామన్నారు.

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి
1
1/1

వీరన్న సన్నిధిలో భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement