సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
భగీరథ ప్రయత ్నం
బయ్యారం: మోంథా తుపాను కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. పొలాల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైరు వంగిపోవడంతో వరి కంకులు మొలకెత్తే అవకాశం ఉందని, నీరు బయటకు వెళ్లేందుకు పొలంలో కొంత భాగంలో కాల్వ తవ్వాడు బయ్యారానికి చెందిన రైతు తగిర పెద్ద వెంకట్‌రెడ్డి. 7 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 3 ఎకరాల్లో నీరు నిలిచింది. దీంతో పొలంలోని కొంత భాగాన్ని తొలగించి కాల్వ తవ్వి.. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నం చేశాడు. కాగా.. ఈసారి పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని, అధికారులు ఆదుకోవాలని వెంకట్‌రెడ్డి కోరుతున్నాడు.


