నేటినుంచి మక్కల క్రయవిక్రయాలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం ఆదివారం మొక్కజొన్న రాశులతో నిండిపోయింది. తుపాను కారణంగా గత గురు, శుక్రవారాల్లో వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిపివేశారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో యథావిధిగా క్రయవిక్రయాలు జరగనున్నాయి. ఈక్రమంలో రైతులు రెండు మూడు రోజుల ముందు నుంచి మొక్కజొన్నలు విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించారు. కొందరు షెడ్ల ఆవరణలో మొక్కజొన్నల్ని రాశులుగా పోసుకోగా, తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ఖాళీ స్థలాల్లో ఆరబోసుకోవడం కనిపించింది.


