వంతెన ఎక్కలేక.. పట్టాలు దాటలేక!
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో వంతెన ఎక్కలేక.. పట్టాలు దాటలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫామ్‌లున్నాయి. మరో ప్లాట్‌ఫామ్ నిర్మించాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ట్రైన్‌లు వచ్చి మూడో ప్లాట్‌ఫాంపై ఆగడంతో వంతెన మెట్లు ఎక్కలేనివారు, మోకాళ్లనొప్పులతో బాధపడేవారు, దివ్యాంగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన ఆస్పత్రి, కలెక్టరేట్, మార్కెట్ ప్రాంతాలన్నీ ప్రతిపాదిత నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం వైపు ఉన్నాయి. అటువైపు వెళ్లే వాళ్లంతా మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై దిగి ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో పలు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో 4వ నంబర్ ప్లాట్‌ఫామ్ నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.
వంతెన ఎక్కలేక.. పట్టాలు దాటలేక!


