విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మైస నాగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వలకు చాలాసార్లు విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశామన్నారు. పెన్షనర్లకు నగదు రహిత ఈహెచ్‌ఎస్ సేవలను అన్ని కార్పొరేట్ హాస్పటల్స్‌లో అందించాలని, మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన వారికి పెన్షన్లు, బెనిఫిట్స్ చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఐదు డీఆర్ బకాయిలు ఒకేసారి చెల్లించాలని, పీఆర్సీ అమలు పరుస్తూ బకాయి అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య, జిల్లా బాధ్యులు మోహన్‌రావు, నారాయణ, రాములు, చంద్రయ్య, మంగపతిరావు, మండల బాధ్యులు వెంకట్‌రెడ్డి, మహేందర్, శ్రీనివాస్‌రావు, నాగేందర్‌రావు, మల్లయ్య, గోవర్ధన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


