ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల శివారు గోపాల్‌రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన ఇప్ప నాగరాజు(23) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటన్నాడు. కొంత కాలంగా ఆటో సరిగా నడవకపోవడంతో దాదాపు రూ. లక్షా 30వేల అప్పు అయ్యిందిు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఆదివారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య నాగరాణి, కుమారుడు సిద్దు ఉన్నాడు. మృతుడి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.
శాయంపేట : అనారోగ్య కారణాలతో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన మండలంలోని కొత్తగట్టు సింగారంలో జరిగింది. ఎస్సై జక్కుల పరమేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలేటి బుచ్చివీరు(80) గత నెల 26వ తేదీన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు 27న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుచ్చివీరు ఆదివారం గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పరమేశ్ తెలిపారు.


