
‘కపాస్ కిసాన్’పై అవగాహన కల్పించాలి
వరంగల్: కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్‌పై పత్తి రైతులకు అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా పత్తి ప్రొక్యూర్మెంట్ ప్రత్యేకాధికారి, రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మిన్‌బాషా అన్నారు. బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వెంకటరెడ్డితో కలిసి ఏనుమాముల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి యార్డులో రైతులు తీసుకొచ్చిన పత్తిలో నాణ్యత, తేమ శాతం ఎంత వరకు వస్తున్న విషయాన్ని యార్డు సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. వెంకటసాయి ట్రేడర్స్ అడ్తికి తీసుకొచ్చిన హనుమకొండ జిల్లా నడికూడకు చెందిన పత్తి రైతు వెంకటేశ్వర్లుతో మాట్లాడుతూ కనీస మద్దతు ధర పొందడానికి, కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్ముకునేందుకు ముందే కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని నిర్ధారణ అయిన తదుపరి విక్రయానికి తీసుకురావాలన్నారు. అనంతరం కొత్తపేటలోని శ్రీరాజ్ కాటన్ ఇండస్ట్రీన్ మిల్లును పరిశీలించి, మిల్లు యాజమానికి కపాస్ కిసాన్ యాప్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు రైతులకు కనబడేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీడీఎం వి.పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, డీఏఓలు అనురాధ, రవీందర్‌సింగ్, డీహెచ్‌ఎస్‌ఓలు అనసూయ, శ్రీనివాసరావు, డీసీఓ సంజీవరెడ్డి, డీఆర్‌డీఓలు రాంరెడ్డి, శ్రీను, గ్రేడ్ 2 కార్యదర్శి జి.అంజిత్‌రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, జిన్నింగ్ మిల్లుల యజమానులు కె.నాగభూషణం, చింతలపల్లి వీరారావు, తదితరులు పాల్గొన్నారు.
27 తర్వాతే...
ఇటీవల కురిసిన వర్షాలతో మార్కెట్‌కు వచ్చే పత్తిలో తేమ అధికంగా ఉండడంతో 27వ తేదీ తర్వాతే దశల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సీసీఐ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న పత్తిలో తేమ శాతం సుమారు 18కి పైగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. తేమ 12శాతం కంటే తక్కువ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ఉమ్మడి జిల్లా పత్తి ప్రొక్యూర్మెంట్
ప్రత్యేకాధికారి యాస్మిన్ బాషా
ఏనుమాముల మార్కెట్ పత్తియార్డు, జిన్నింగ్ మిల్లు పరిశీలన