కేయూకు పూర్వవైభవం తీసుకొద్దాం | - | Sakshi
Sakshi News home page

కేయూకు పూర్వవైభవం తీసుకొద్దాం

Oct 23 2025 9:39 AM | Updated on Oct 23 2025 9:39 AM

కేయూకు పూర్వవైభవం తీసుకొద్దాం

కేయూకు పూర్వవైభవం తీసుకొద్దాం

వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌: పూర్వ విద్యార్థుల, ప్రభుత్వ సహకారంతో కాకతీయ యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకొద్దామని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పరిపాలన భవనం సెనేట్‌హాల్‌లో నిర్వహించిన తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ సక్సెస్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఏడాది ఆగస్టు 19 నుంచి 21వ తేదీవరకు తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ను విజయవంతంగా నిర్వహించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బోధన, బోధనేతర ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ విజయవంతంలో ప్రతీ ఒక్కరి కృషి ఉందన్నారు. విశ్వవిద్యాలయం బ్లాక్‌ గ్రాంట్‌ రూ. 145 కోట్లకు చేరిందన్నారు. అలాగే, రూ. 50కోట్ల గ్రాంట్‌ సాధించగలిగామన్నారు. రూసా నిధులతో 37 వ్యక్తిగత ప్రాజెక్టులు, 5 రీసెర్చ్‌ సెంటర్లను 23 రీసెర్చ్‌ ఫెల్లోస్‌తో వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. కేయూలోని కేహబ్‌ హైదరాబాద్‌లోని టీహబ్‌తో ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. బోధన, బోధనేతర ఉద్యోగులకు త్వరలోనే ముఖహాజరు గుర్తింపు హాజరును తీసుకురానున్నామన్నారు. తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ లోకల్‌ ఆర్గనైజింగ్‌సెక్రటరీ ప్రొఫెసర్‌ వెంకట్రామ్‌రెడ్డి, తెలంగాణ అకాడమీ సైన్స్‌ బాధ్యులు ఎస్‌ఎం రెడ్డి, సంజీవరెడ్డి సైన్స్‌కాంగ్రెస్‌ నిర్వహణలో అనుభవాలను పంచుకున్నారు. అనంతరం తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ సంగ్రహణ వివరణ పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం పాల్గొన్నారు. తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ విజయవంతం కావడానికి ప్రధాన భూమిక పోషించిన వివిధ కళాశాలల కమిటీలు, విభాగాలు, అధికారులు, ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు.

సెంట్రల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ నిర్మాణానికి

శంకుస్థాపన..

కాకతీయ యూనివర్సిటీలో రూసా నిధులు రూ. 3కోట్ల 50లక్షల వ్యయంతో సెంట్రల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి బుధవారం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి.. రిజిస్ట్రార్‌ వి. రామచంద్రంతో కలిసి శంకుస్థాపన చేశారు. క్యాంటీన్‌ పక్కన స్థలంలో ఈ భవనం నిర్మిస్తున్నారు. రూసా నిధుల ద్వారా సైన్స్‌ ప్రాజెక్టులు ఇప్పటికే ఆచార్యులకు కేటాయించారు. ఆ భవన నిర్మాణం పూర్తయ్యాక పరిశోధనలకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసి వినియోగంలోనికి తీసుకురానున్నట్లు రిజిస్ట్రార్‌ రామచంద్రం, కేయూఅభివృద్ది అధికారి వాసుదేవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యులు సురేశ్‌లాల్‌, సుదర్శన్‌, రమ, చిర్రరాజు, సుకుమారి, ఆచార్యులు నవీన్‌, రూసా నోడల్‌ ఆఫీసర్‌ మల్లికార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement