
విద్యుదాఘాతంతో సామిల్ డిపో దగ్ధం
పరకాల: మండలంలోని కామారెడ్డిపల్లెలో విద్యుదాఘాతంతో బాలాజీ సామిల్ టింబర్ డిపో దగ్ధమైంది. బుధవారం తెల్లవారుజామున మిల్లు నుంచి మంటలు రావడాన్ని గమనించిన గ్రామస్తులు డిపో యాజమాని తాండ రమేశ్‌కు సమాచారం అందించారు. దీంతో రమేశ్.. పరకాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వాహనంతో చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్చారు. అప్పటికే మిల్లులోని మిషన్లు, కలప పూర్తి గా దగ్ధమై రూ. 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రమేశ్ పేర్కొన్నాడు. కాగా, బాలాజీ సామిల్ టింబర్ డిపోను మాజీ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు సందర్శించి బాధితుడు రమేశ్‌ను పరామర్శించారు.
రూ. 15లక్షల మేర ఆస్తి నష్టం