
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్ : జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతోన్న వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఆసక్తి గల పౌల్ట్రీ ఫాం యజమానుల నుంచి టెండర్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. http:// tendertelangana.gov.in వెబ్‌సైట్‌లో టెండర్ పాసెసింగ్ ఫీజు రూ.10,000 చెల్లించాలని తెలిపారు. టెండర్ ఫీజు సదరు వ్యక్తులకు తిరిగి చెల్లించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. Dist.SCDevelopmentOfficer, మహబూబాబాద్ పేరు మీద డీ.డీ. చెల్లించాలని, http://tender.telangana.gov.in వెబ్‌సైట్‌లో టెండరును దాఖలు చేయాలని తెలిపారు. అగ్‌మార్క్ నియమాల ప్రకారం గుడ్లు సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. 21–10–2025న నిర్వహించే ప్రీ బిడ్ సమావేశం 23వ తేదీన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 93901 15539, 91822 04529 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ రైజింగ్ సిటిజన్ సర్వేలో పాల్గొనాలి
మహబూబాబాద్: తెలంగాణ రైజింగ్ –2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని జిల్లా పౌరసంబంధాల అధికారి రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ సర్వేలో కేవలం తెలంగాణ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని విలువైన సమాచా రాన్ని అందించినట్లు తెలిపారు. స్వతంత్ర భారత్‌గా ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వే చేపట్టిందని తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ సర్వేలో పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రధానంగా యువత ఈ సర్వేలో పాల్గొని దేశం, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్‌కు సూచనలు సలహాలు అందించాలని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
సంపూర్ణ ఆరోగ్యానికి
వెల్‌నెస్ సెంటర్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లోని విద్యార్థులకు, అధ్యాపకులకు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యానికి వెల్‌నెస్ సెంటర్ తోడ్పడుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్, బెంగుళూరు హార్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌ను మంగళవారం బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ వెల్‌నెస్ సెంటర్‌ను వినియోగించుకోవాలని ఈసందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్‌కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యూరిటీ అండ్ ప్లేస్‌మెంట్స్ బాధ్యులు మహ్మద్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని తొర్రూరు బాలికలు –1 గురుకులంలో జూనియర్ లెక్చరర్ బాటనీ (1), జూనియర్ లెక్చరర్ జువాలజీ (1), డోర్నకల్ గురుకుల పాఠశాల బాలికలు –1లో టీజీటీ మ్యాథ్స్ (1) పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులు ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు మహబూబాబాద్‌లోని పాత కలెక్టరేట్ కార్యాలయం రోడ్డు, నూర్ మసీదు కాంప్లెక్స్ వద్ద ఏజెన్సీ కార్యాలయంలో లేదా, 90521 74603 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేడు స్వామి వారి కల్యాణం
రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (బుధవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.