
వైభవంగా దీపావళి వేడుకలు
● మహాలక్ష్మీదేవి నమోస్తుతే..
● భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాలు
● బాణసంచాతో చిన్నారుల సంబురాలు
మహబూబాబాద్ రూరల్: దీపావళి పండుగను సోమ, మంగళవారాల్లో జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఈ సందర్భంగా దీపం పూజలు, శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారి పూజలు, కేదారేశ్వర వ్రతాలను వైభవంగా ఆచరించారు. సిరులను కురిపించే శ్రీలక్ష్మీదేవి అమ్మవారు సుఖసంతోషాలు కలుగజేయాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో పసుపు కుంకుమలు చల్లి, నూతన కరెన్సీ నోట్లు, పలు రకాల పిండి వంటలు నైవేధ్యగా సమర్పించి పూజలు నిర్వహించారు. మార్వాడిల ఇళ్లలో సర్వాంగ సుందరంగా దీపాలంకరణలు చేశారు. పూజల అనంతరం టపాసులు కాలుస్తూ దీపావళి పండుగను సంబురంగా జరుపుకున్నారు. దుకాణాలు, ఇళ్ల ఎదుట కొబ్బరి, అరటి, విద్యుత్ దీపాలతో అలంకరణలు ఏర్పాటుచేశారు.

వైభవంగా దీపావళి వేడుకలు

వైభవంగా దీపావళి వేడుకలు