
యాసంగికి సన్నద్ధం కావాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
● ట్రాన్స్ కో, డిస్కం అధికారులతో సమీక్ష
హన్మకొండ: యాసంగి సాగుకు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి విద్యుత్ అధికారులకు సూచించారు. హనుమకొండ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌కో సీఈలు, ఎస్‌ఈలు, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈలు, ఎస్‌ఏఓలతో శనివారం సమీక్ష నిర్వహించారు. డివిజన్లు, జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్తగా నెలకొల్పే 220/33 కేవీ, 132/33 కేవీ కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్ధ్యం పెంపు, డబుల్ సర్క్యూట్ లైన్లు, బే ఎక్స్‌టెన్షన్ ప్రతిపాదనలు పంపాలని, పురోగతిలో ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులకు ట్రాన్స్‌కోకు లేఖలు రాయాలని సూచించారు. ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్లు తగ్గించాలని, రిపేర్లు పెంచాలన్నారు. వ్యవసాయ, కొత్త సర్వీసులు, టీజీఐ పాస్‌లో నమోదు చేసుకున్న సర్వీసులు త్వరగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్‌లాల్, కె.తిరుమల్‌రావు, అశోక్, రాజు చౌహన్, ట్రాన్స్ కో చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్‌కుమార్ పాల్గొన్నారు.