
నేడు మేడారానికి మంత్రి పొంగులేటి రాక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం మేడారానికి రానున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సాలహారం నిర్మాణ పనులతోపాటు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్‌లో జిల్లా అధికారులతో అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణ పనులు, జాతర ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి సమీక్షించనున్నారు. మంత్రి సీతక్క కూడా హాజరు కానున్నారు.
డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు 23వ తేదీ వరకు గడువు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం బీఎస్సీ, బీ ఓకేషనల్, బీసీఏ, బీహెచ్‌ఎం అండ్ సీటీ (రెగ్యులర్ అండ్ బ్యాక్ లాగ్ ) కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల పరీక్ష ఫీజు అపరాధ రుసుము లేకుండా ఈనెల 23వ తేదీవరకు చెల్లించేందకు గడువు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 25వతేదీ వరకు చెల్లించొచ్చని తెలిపారు. ఆయా కోర్సుల ఫీజులు, తదితర వివరాలు సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పరీక్షలు నవంబర్–డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.

నేడు మేడారానికి మంత్రి పొంగులేటి రాక