
అధికారులు సమన్వయంతో పని చేయాలి
మహబూబాబాద్: గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరవయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. ఆది కర్మయోగి పథకానికి సంబంధించి కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పథకాల ఫలితాలు క్షేత్రస్థాయిలో గిరిజన ఆదివాసీలకు అందెలా ప్రతీ అధికారి కృషి చేయాలన్నారు. ఆదివాసీ గిరిజన గూడేలను అభివృద్ధి బాటలో నడపాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు దేశీరామ్, ఏటీడీఓ భాస్కర్, డీపీఎం శ్రీకాంత్, సీడీపీఓ నీలోఫర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో