
ఆదివాసీల అభివృద్ధికి ‘ఆదికర్మయోగి’
మహబూబాబాద్ అర్బన్: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆది కర్మయోగి అభియాన్ అనే కొత్త కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ, గూడెం, తండాల్లో ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారా ల శాఖ మంత్రితత్వ నిర్ణయించింది. దీంతో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, మహిళ శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లయ్, మిషన్ భగీరథ, ఫారెస్టు, ఆదివాసీల జీవన విధానంలో మార్పులు, ఆర్థిక పురోగతి, సామాజిక, రాజకీయ, ఎదుగుదల, ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల అభివృద్ధి తదితర అంశాలపై 105 మందికి మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. వీరు మండలాలు, గ్రామస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చి బృందాలుగా వెళ్లి ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పన, వారి అభివృద్ధికి కావాల్సిన అవసరాలను తెలుసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లాలో వెనుకబడి ఉన్న 92 గ్రామాలను గుర్తించారు.
ప్రభుత్వ ఫలాలు అందడమే లక్ష్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ఆదివాసీ, గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చే స్తున్నాయి. ఆ పథకాలు వారికి అందడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆదికర్మయోగి అభియాన్‌ను రూపొందించింది. ఆదివాసీ కుటుంబాల ఆచారాలు , జీవనశైలి, సంప్రదాయాలు, పురాతనంగా ఉంటా యి. అడవిని వదిలి బయటకు రావడానికి ఇష్టపడరు. దీంతో గిరిజన సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం, ఫారెస్ట్, తాగునీరు, మేకల పెంపకం, మునగ సాగు, అంగన్‌వాడీ, పాఠశాల భవనాలు, జీవిత బీమా, పక్కా ఇల్లు, మెరుగైన పారిశుద్ధ్యం, పరిశుభ్రత, విద్యుత్, సుస్థిర జీవనోపాధి, విద్య, ఆ రోగ్య, పోషకాహారం, రహదారి, ప్రసార సాధనా లు, సామాజిక సమస్యలు, బాల్య వివాహాలు, వరకట్నం, గృహహింస, పింఛన్లు, సామాజిక భద్రత పథకాలు ఆదివాసీ, గిరిజనులకు వివరించి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా ఆదికర్మయోగి పథకం ద్వారా చర్యలు చేపట్టనున్నారు.
ముగిసిన మూడు రోజుల శిక్షణ
ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
జిల్లా వ్యాపంగా 105 మందికి శిక్షణ