
23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి
ములుగు: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధికి ఈ నెల 23 (మంగళవారం)న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నట్లు తెలిసింది. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అభివృద్ధిపై సమీక్ష అనంతరం డిజైన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేస్తారని సమాచారం. శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై ఐసీసీసీలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
‘ఇందిరమ్మ’ పనుల పరిశీలన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జెడ్పీ సీఈఓ పురుషోత్తం శనివారం పరిశీలించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధన మేరకు ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ రఘుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పార్వతి పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్‌తో సేవాస్ఫూర్తి
మహబూబాబాద్ అర్బన్: జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్)తో విద్యార్థుల్లో సేవా స్ఫూర్తి పెంపొందుతుందని అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోపని జామండ్లపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు శనివారం ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డుపల్లి ఉపేంద్రం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు పొగొట్టేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవ చేయడం అదృష్టమని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్ జక్కుల స్వాతి, అధ్యాపకులు శ్రీనివాస్, కిరణ్‌కుమార్, శ్రీను, నవీన్, శ్రావణ్, రవి పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి
దంతాలపల్లి: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించినప్పుడే గ్రామాలు బాగుంటాయని స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకులంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాల సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంపై పంచాయతీ రాజ్ అధికారులు ఆరా తీయాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడంతోపాటు శానిటేషన్ పనులను పరిశీలించాలన్నారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు వాడకంతో కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ, ఎంపీఓ అప్సర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కార్యదర్శి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రామప్పలో
విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతి గాంచి న రామప్ప దేవాలయాన్ని హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న విదేశీయులు శిక్షణలో భాగంగా శనివారం సందర్శించారు. ఇరాక్, పాలస్తీనా, అర్మేనియా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, ఈజిప్ట్, దక్షిణ సూ డాన్, జిబౌటి, ఉగాండా, టాంజానియా, కె న్యా, కోట్ డివోయిర్, గాంబియా, లైబీరియా, ఘనా, మొజాంబిక్, జాంబియా, నమీబియా, మారిషస్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, సురి నామ్ దేశాలకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు, అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నా రు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వ దించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు.

23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి

23న మేడారానికి సీఎం రేవంత్‌రెడ్డి