
దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
● చిలుక మధుసూదన్ రెడ్డి
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండేలా పాలన చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం గౌరవ అధ్యక్షు డు చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. మహబూబా బాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో హైదరాబాద్ శివారు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సభ్యులు శనివారం పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందించారు. మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి శక్తిని ప్రసాదించాలని స్వామిని వేడుకున్నామనారు. రామరాజు యాకన్న ఉన్నారు.