
ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ
నేటినుంచి బతుకమ్మ వేడుకలు
మహిళలకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగ రానేవచ్చింది. మహాలయ/పితృ అమావాస్యతో ప్రారంభయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించే ఈ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ఆటపాటలతో సేదదీర్చడంతోపాటు జీవన విధానాన్ని ఈ పండుగ ఆవిష్కరిస్తుంది. అడవిలో లభించే గునుగు, తంగేడుతోపాటు తీరొక్కపూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చుతారు. దీంతోపాటు శనివారం సాయంత్రం నుంచే జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక పూల విక్రయ కేంద్రాల వద్ద సందడి కనిపించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాటపట్టారు. పలుపాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
– మహబూబాబాద్ రూరల్

ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025