
రైతులకు యూరియా పంపిణీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్ట ణంలోని పీఏసీఎస్ వద్ద బుధవారం 330 మంది రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి తెల్ల వారుజాము నుంచి యూరి యా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పర్యవేక్షించారు. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శివ, ఏఆర్, పలు విభాగాల పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు.
రామప్ప టెంపుల్ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ అద్భుతంగా ఉందని జర్మనీ దేశానికి చెందిన క్రిష్టియన్ స్లావిక్ కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.

రైతులకు యూరియా పంపిణీ