
విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
● డీఈఓ దక్షిణామూర్తి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ీఈఓ మాట్లాడుతూ.. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం తరగతి గదులు, వంట గదులను పరిశీలించి, చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవాలన్నారు. జీసీడీఓ విజయకుమారి, సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాల ఎస్‌ఓ భవాని పాల్గొన్నారు.