
నీలినీడలు..
నగదు అందించాలి..
నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి సొసైటీలకు డబ్బులు అందించాలి. టెండర్ల ద్వారా ఉచితంగా ఇస్తున్న చేప పిల్లలు సరైన సైజు ఉండడం లేదు. తక్కువగా పిల్లలు వస్తున్నాయి. తద్వారా మత్స్యకారులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి నగదు చేయాలి.
– కొత్తూరు రమేశ్,
ముదిరాజ్ సంఘం నాయకుడు
త్వరలో పంపిణీ చేస్తాం
జిల్లా వ్యాప్తంగా ఉచిత చేప పిల్లలను త్వరలో పంపిణీ చేస్తాం. ఈనెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మత్స్య సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు ఆందోళన చెందవద్దు.
–శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
తొర్రూరు రూరల్: మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది. ఏటా టెండర్లు నిర్వహించి చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతున్నారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు టెండర్లు నిర్వహించకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందా.. ఉండదా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కాగా చేప పిల్లలకు బదులు సొసైటీలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో ప్రణాళిక ఇలా..
జిల్లాలోని సుమారు 1,000 చెరువులు, 220 కుంటల్లో 4.50కోట్ల చేప పిల్లలను ఈ ఏడాది వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడం చేప పిల్లల పంపిణీ టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. కాగా అదును దాటితే చేప పిల్లల ఉత్పత్తి సరిగ్గా ఉండదని మత్స్యకారులు అంటున్నారు.
నగదు బదిలీ చేయాలి..
టెండర్ ద్వారా అందించే చేప పిల్లలు నాసికరంగా ఉండడంతో ఎదగడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు చేపపిల్లల్లో కోత విధిస్తున్నారని, చిన్న సైజు పిల్లలను ఇస్తూ చేతులు దులుపుకుంటున్నార ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తమ ఉపాధికి గండి పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి నేరుగా మత్స్య సొసైటీలకు డబ్బులు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
చేప పిల్లల పంపిణీపై సందిగ్ధం
ఇంకా పూర్తికాని టెండర్లు
అదును దాటితే పిల్లలు పెరగవని ఆందోళన
సొసైటీలకు నగదు అందించాలని
మత్స్యకారుల డిమాండ్

నీలినీడలు..

నీలినీడలు..