
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్ళి కుమ్మరికుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డైలీ వేజ్ వర్కర్లు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా నాగన్న మాట్లాడుతూ.. గతంలో గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లకు కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించారన్నారు. 2021లో ఆర్థికశాఖ విడుదల చేసిన జీఓ నంబర్ 64 వల్ల వేతనాలు తగ్గాయన్నారు. వెంటనే ఆ జీఓను రద్దు చేసి, పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలన్నారు. 212జీఓను సవరణ చేసి 2014 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలన్నారు. నాయకులు కుర్ర మహేశ్, జ్యోతిబసు, మధు, వెంకన్న, మహేశ్, లింగ్యా, రవీందర్ పాల్గొన్నారు.