
రైతులు ఆందోళన చెందవద్దు
డోర్నకల్: రైతులు యూరియా బస్తాల కోసం ఆందోళన చెందవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. సీరోలు మండలం మన్నెగూడెం పీఏసీ ఎస్‌లో ఆదివారం ఎరువుల పంపిణీని పరిశీలించారు. డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి పలు కేసుల వివరాల గురించి తెలుసుకున్న ఎస్పీ మన్నెగూడెంలో ఎరువుల పంపిణీని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో డోర్నకల్ సీఐ రాజమౌళి, ఎస్సై వంశీధర్, పీఏసీఎస్ సెక్రటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బయ్యారంలో పరిశీలన..
బయ్యారం: మండల కేంద్రంలోని రైతువేదిక, గంధంపల్లిలోని రైతువేదికలో ఆదివారం నిర్వహించిన యూరియా పంపిణీని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. గంధంపల్లిలో ఓ రైతు దిచక్రవాహనంపై తన సిబ్బందితో స్వయంగా యూరియా బస్తాలు వేయించిన ఎస్పీ జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. తహసీల్దార్ నాగరాజు, గార్ల–బయ్యారం సీఐ రవికుమర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎస్సై తిరుపతి తదితరులు ఉన్నారు.
జాగ్రత్తగా వెళ్లాలి..
కురవి: ఆదివారం సీరోలు మండలం కాంపల్లి సొసైటీ వద్ద ఓ రైతు రెండు యూరియా బస్తాలను తీసుకున్నాడు. తన బైక్‌పై బస్తాలను పెట్టేందుకు యత్నిస్తుండగా సిబ్బంది సాయం చేశారు. ఆ రైతు దగ్గరకు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెళ్లి బస్తాలతో బైక్‌పై జాగ్రత్తగా వెళ్లు.. పదిలంగా ఇంటికి చేరుకో అని జాగ్రత్తలు చెప్పారు. దీంతో ఆ రైతు జాగ్రత్తగా వెళ్తానని ఎస్పీకి చెప్పాడు.
పంపిణీ పరిశీలన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ ప్రక్రియను ఆదివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడుతూ.. అవసరం ఉన్నంత మేరకు యూరియా సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై శివ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
యూరియా కేంద్రం తనిఖీ
గార్ల: గార్ల మండలం ముల్కనూరు గ్రామంలోయూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. యూరియా రైతులందరికీ అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ వెంట గార్లబయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై రియాజ్‌పాషా, ఏఓ కావటి రామారావు, ఏఎస్సైలు వెంకట్‌రెడ్డి, రవీందర్ ఉన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్