
చైన్‌స్నాచర్ అరెస్ట్, రిమాండ్
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని సముద్రాల శివారు నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు కత్తుల రాజమ్మ మెడ నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించిన కుక్కల రాంబాబును పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జి.వేణు కథనం ప్రకారం.. జఫర్‌గఢ్ మండలం కూనూరుకు చెందిన కుక్కల రాంబాబు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గతేడాది నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ల్లో పాల్గొంటూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో రూ.70వేలు ఉంచి కిరాణాషాపుకు వెళ్లొచ్చే సరికి ఆ నగదు తస్కరించాడు. ఆ ఘటనలో పోలీసులకు చిక్కి వారం రోజులు జైలుకెళ్లొచ్చాడు. అయినా మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన ఉదయం మహిళా రైతు కత్తుల రాజమ్మ, యాదగిరి దంపతులు యూరియా కోసం స్టేషన్‌ఘన్‌పూర్ వచ్చారు. సాయంత్రం బైక్‌పై యూరియా తీసుకెళ్తుండగా రాంబాబు బైక్‌పై వారిని అనుసరించాడు. విశ్వనాథపురం వద్ద రాజమ్మ మెడ నుంచి రూ.1.20లక్షల విలువైన మూడుతులాల పావు బంగారు పుస్తెలతాడు గొలుసును లాక్కుని ఉడాయించాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎస్సై మనీషా ఈనెల 12న ఘన్‌పూర్ శివాజీ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళా రైతు రాజమ్మ మెడ నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించింది తానేనని అంగీకరించాడు. దీంతో పుస్తెలతాడును, బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, చైన్‌స్నాచింగ్ జరిగిన వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి బంగారం రికవరీ చేసిన సీఐ జి.వేణు, ఎస్సైలకు,సిబ్బందికి బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వినయ్‌కుమార్, మనీషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వారం రోజుల్లోనే
నిందితుడిని పట్టుకున్న పోలీసులు