
ఎన్నికల ప్రక్రియపై
మహబూబాబాద్ : జిల్లా పంచాయతీ అధికారులు స్థానిక సంఎన్నికల ప్రక్రియపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేయడంతో పాటు బ్యాలె ట్ బాక్స్‌లు సమకూర్చుకున్నారు. నోటిఫికేషన్ కోసం అధికారులు, ప్రజలు ఎదురూచూస్తున్నారు. కాగా యూరియా సమస్య తలెత్తకుంటే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేదని జిల్లాలో చర్చగా మారింది.
జిల్లాలో 482 జీపీలు..
జిల్లాలో 18 మండలాలు, 5 మున్సిపాలిటీలు, 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 5,56,780 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 2,73,692 మంది, మహిళా ఓటర్లు 2,83,064 మంది ఉన్నారు. ఈమేరకు మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 18 జెడ్పీటీసీ స్థానాలు, 193 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 1,066 పోలింగ్ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా కూడా ఫైనల్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి 3,721 బ్యాలెట్ బాక్స్‌లు, రాగా వాటిని చెక్ చేసి భద్రపరిచారు.
ఐదు మండలాల్లో 40,000లకు పైగా ఓటర్లు..
జిల్లాలోని ఐదు మండలాల్లో 40,000లకు పైగా ఓటర్లు ఉన్నారు. గూడూరులో 48,570మంది ఓటర్లు, తొర్రూరు 47,089 మంది, మరిపెడ 46,478 మంది, కురవి 44,216 మంది, నర్సింహులపేట మండలంలో 40,471 మంది ఓటర్లు ఉన్నారు.
యూరియాతోనే ఎన్నికలు ఆలస్యమని చర్చ..
యూరియా సమస్య వల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందనే చర్చ జరుగుతోంది. మరో రెండు నెలల ఆలస్యం కావొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చనే కోణంలో అధికారులు అన్ని సిద్ధం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
మండలాల వారీగా జీపీలు, ఓటర్ల వివరాలు
మండలం జీపీలు వార్డులు పురుష మహిళా
ఓటర్లు ఓటర్లు
బయ్యారం 29 252 18,887 19,724
చిన్నగూడూరు 11 96 6,507 6,590
దంతాలపల్లి 18 166 13,019 13,663
డోర్నకల్ 26 218 14,289 14,799
గంగారం 12 100 4,543 4,631
గార్ల 20 184 15,007 15,699
గూడూరు 41 354 23,851 24,717
ఇనుగుర్తి 13 112 8,968 9,166
కేసముద్రం 29 254 15,980 16,123
కొత్తగూడ 24 202 11,740 12,326
కురవి 41 344 21,464 22,752
మానుకోట 41 338 19,422 20,244
మరిపెడ 48 396 22,986 23,492
నర్సింహులపేట 23 194 12,118 12,616
నెల్లికుదురు 31 280 20,019 20,451
పెద్దవంగర 26 192 12,511 12,898
సీరోలు 18 152 9,118 9,350
తొర్రూరు 31 276 23,263 23,823
వార్డులు 4110, పోలింగ్ కేంద్రాలు 4,110
జిల్లాలో 5,56,780 మంది ఓటర్లు
మహిళా ఓటర్లే ఎక్కువ
3,721 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసిన అధికారులు
నోటిఫికేషన్ కోసం ఎదురుచూపు