
విద్యార్థికి పాముకాటు
కొత్తగూడ: విద్యార్థి పాము కాటుకు గురైన సంఘటన మండలంలో ని ఎదుళ్లపల్లి జెడ్పీ ఉన్న త పాఠశాలలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెగడపల్లి గ్రామానికి చెందిన వల్లపు రంజిత్ ఎదుళ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌లో మూత్రశాలలు లేకపోవడంతో ఇంటర్‌వెల్‌లో మూత్రవిసర్జనకు బయటికి వెళ్లగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో విద్యార్థి తండ్రి వల్లపు సాంబరాజుకు సమాచారం అందించి 108 ద్వారా వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. బాలుడి ఆర్యోగం నిలకడగా ఉందని సాంబరాజు తెలిపాడు.