
మంచి ఫలితాలు వచ్చేలా బోధించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
నర్సింహులపేట: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని యూరియా పంపిణీ కేంద్రం, హైస్కూ ల్, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. యూరియా పంపిణీ కేంద్రంలో కూపన్లు, యూరియాపై అధికారులను అడిగారు. అనంతరం హైస్కూల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల నోట్ బుక్స్, పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వచ్చేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మాధవి, ఎంఈఓ రామ్మోహన్‌రావు, ఏఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.