
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయికుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం డీఈఓ దక్షిణామూర్తికి డీఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. గాంధీపురం పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు ఒక్కరే పనిచేస్తున్నారని, వెంటనే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ శ్రీకాంత్, పట్టణ నాయకులు ప్రవీణ్, ప్రసాద్ పాల్గొన్నారు.