
నేడు కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం
మహబూబాబాద్: ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన దినోత్సవానికి కలెక్టర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో అలకరించారు. కాగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ హాజరుకానున్నట్లు కలెక్టరేట్ అధికారులు మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 9.58గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ముందుగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్ ముఖ్య అతిథిని స్వాగతిస్తారన్నారు. ఉదయం 10గంటలకు రాంచంద్రునాయక్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. 10.01 గంటలకు జాతీయ గీతాలాపన, 10.02 గంటలకు రాష్ట్ర అధికారిక గీతాలాపన ఉంటుందని తెలిపారు. 10.07గంటలకు ముఖ్యఅతిథికి పోలీసుల గౌరవ వందనం, 10.10గంటలకు ముఖ్య అతిథి ప్రసంగం, 10.15గంటలకు కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లా అఽధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సకాలంలో హాజరుకావాలని కోరారు.
ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరు