
రైతులు అధైర్యపడొద్దు
● ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్
నర్సింహులపేట: రైతులకు సరిపడా యూరియా అందుతుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం నర్సింహులపేట, పెద్దనాగారం రైతు వేదికల వద్ద యూరియా కూపన్లు, బస్తాల పంపిణీని ఎస్పీ పరిశీలించారు. బస్తాల కోసం క్యూలో ఉన్న రైతులతో మాట్లాడారు. ఈరోజు మండలానికి 50టన్నుల యారియా వచ్చిందని, ప్రతీరోజు వస్తుందని, రైతులు ఎలాంటి అందోళన చెందవద్దన్నారు. నిత్యం పోలీసులు బందోబస్తు మధ్య పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. యూరియా పంపిణీపై అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్, ఎస్సై సురేష్, ఏఓ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
సజావుగా సరఫరా
మహబూబాబాద్ రూరల్: యూరియా సరఫరా సజావుగా జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం పీఏసీఎస్, అమనగల్ రైతు వేదిక వద్ద యూరియా టోకెన్లు, బస్తాల పంపిణీ ప్రక్రియను ఎస్పీ గురువారం సందర్శించి పరిశీలించారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు మహేందర్ రెడ్డి, హతీరాం, సర్వయ్య ఉన్నారు.