
విద్యార్థులు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి
● రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి
కొత్తగూడ: విద్యార్థులు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతా లక్ష్మి అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలోని ఏకలవ్య గురుకులంలో గురుకులాల రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం ఏర్పరుచుకుని సాధనకు నిరంతరం కష్టపడాలన్నారు. విద్యతోపాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖ రాలు అధిరోహించాలన్నారు. అదనపు కార్యదర్శి మాధవిదేవి, ఓఎస్‌డీలు రామారావు, శ్రీనివాస్, గంగాధర్, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీఓ రత్నకుమారి, ప్రిన్సిపాల్ అజయ్‌సింగ్, వివిధ పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా, ఈ పోటీలు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి.