
బైక్..భద్రం!
వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలని, వర్షం కురుస్తున్నప్పుడు ప్రయాణించొద్దని సీనియర్ మెకానిక్‌లు సూచిస్తున్నారు.
ఇటీవల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల హాస్టల్ భవనం, ఎమర్జెన్సీ కేర్ భవనాలను రాష్ట్ర మంత్రులు దామోదర రాజన
ర్సింహ, కొండా సురేఖతో కలిసి ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలు విషయాలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల్లో జాప్యం, నారాయణపురం రైతుల సమస్య ప్రధానంగా మంత్రుల ముందు వివరించారు. ఈ అంశాలపై కూడా ఇన్‌చార్జ్ మంత్రి జిల్లా అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం చేయవద్దని మంత్రి సూచించినట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరు, ప్రభుత్వంపై ప్రజలకు ఎటువంటి అభిప్రాయం ఉంది.. ఇంకా ప్రజలకు చేరువయ్యేందుకు ఏం చేస్తే బాగుంటుందనే విషయాలను అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఒక వైపు యూరియా గొడవ, మరోవైపు భూ భూరతి చట్టం అమలుకు శ్రీకారం, ఇంకో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం.. ఇటువంటి పరిస్థితిలో జిల్లా పరిస్థితిపై ఇన్‌చార్జ్ మంత్రి ఆరా తీయడంపై జిల్లాలో చర్చగా మారింది. మంత్రి ఆదేశాలతో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై..