
సీఐఎస్‌ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
● అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
చిట్యాల : మండల కేంద్రానికి చెందిన సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఆరెపల్లి రమేశ్ (38) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచాడు. అతడి పార్థివదేహాన్ని రాంనగర్ కాలనీలో తన ఇంటికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు మంగళవారం గ్రామానికి చేరుకుని రమేశ్ భౌతికకాయంపై జాతీయ జెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా శ్మశానవాటికలో రమేశ్ పార్ధివదేహానికి సీఐఎస్‌ఎఫ్ ఆర్‌ఎస్సై భాస్కర్ (హైదరాబాద్), ఎన్టీపీసీ రామగుండం సీఐఎస్‌ఎఫ్ జవాన్లు తిరుపతిరావు, మనోజ్‌కుమార్ పాండే, గణేష్, శ్రీధర్, అనిల్‌కుమార్, గౌతమ్‌కుమార్ అధికార లాంఛనాలతో నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతదేహంపై కప్పిన జాతీయ జెండాను అతడి భార్య మమతకు అప్పగించారు. రమేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సీఐఎస్‌ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు