
కాంటాలు సక్రమంగా లేకుంటే చర్యలు
● ఇన్‌చార్జ్ తూనికలు కొలతల
జిల్లా అధికారి శ్రీలత
మహబూబాబాద్: వ్యాపారుల కాంటాలు సక్రమంగా ఉండాలని, తూకాల్లో తేడా వస్తే కేసులు నమోదు చేస్తామని ఇన్‌చార్జ్ తూనికలు కొలతల జిల్లా అధికారి శ్రీలత అన్నారు. వ్యా పారులు నిబంధనలకు విరుద్ధంగా వస్తువులు విక్రయిస్తున్నారని, నాణ్యత లేని ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని, తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని ఈనెల 8న సాక్షి దినపత్రికలో ‘తూతూ మంత్రంగా తనిఖీలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్‌చార్జ్ తూనికలు కొలతల జిల్లా అధికారి శ్రీలత స్పదించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కూరగాయాల మార్కెట్‌ను సందర్శించి కాంటాలు, బాట్లను తనిఖీ చేశారు. అలాగే కిరాణా షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వినియోగదారులకు నష్టం చేస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ఎనిమిది షాపులు తనిఖీ చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

కాంటాలు సక్రమంగా లేకుంటే చర్యలు