
హాస్టల్, మెస్ కోసం రెన్యువల్ చేసుకోవాలి
కేయూ క్యాంపస్: కేయూలో ఈ విద్యాసంవత్సరం హాస్టల్, మెస్ కోసం విద్యార్థులు రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ వరకు మాత్రమే చివరి గడువు ఉంది. రెన్యువల్ చేసుకునేందుకు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్ ఇచ్చిన గడువు ముగిసింది. 79 మంది మాత్రమే విద్యార్థులు రెన్యువల్ చేసుకున్నారు. ఫీజు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన చేయడంతో అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.500 తగ్గించారు. దీంతో రెన్యువల్ చేసుకున్న రసీదు, ఇప్పటివరకు వినియోగిస్తున్న ఒరిజినల్ మెస్‌కార్డును క్యాంపస్‌లోని హాస్టల్ ఆఫీస్‌లో సమర్పించిన విద్యార్థులకు కొత్తగా మెస్‌కార్డులు జారీచేస్తున్నారు. తక్కువ మంది రెన్యువల్ చేసుకోవడంతో ఇంకా గదులను విద్యార్థులకు కేటాయించలేదు. వసతి, మెస్ సౌకర్యం మాత్రం ప్రస్తుతం యథా విధిగా పొందుతున్నారు. విద్యార్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో రూ.500 ఫీజు చెల్లించి రెన్యువల్ చేసుకో వాలని హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ ఆదివారం తెలి పారు. రెన్యువల్ చేసుకోని విద్యార్థులకు హాస్టల్ వసతి, మెస్ సదుపాయం ఉండదని పేర్కొన్నారు.