
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
కేసముద్రం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం ఇనుగుర్తి, కేసముద్రం మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసనాలు, స్టోర్ గదిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. రెండు మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగులకు సరైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కేసముద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలోని చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధగా ఉండాలన్నారు. తనిఖీలో మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.