మొదటి ప్రశంస కాళోజీదే | - | Sakshi
Sakshi News home page

మొదటి ప్రశంస కాళోజీదే

Sep 9 2025 1:04 PM | Updated on Sep 9 2025 1:04 PM

మొదటి

మొదటి ప్రశంస కాళోజీదే

‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి

‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి
బీజేపీ రాష్ట్ర కమిటీలో ఈసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక్కరికి కూడా చోటుదక్కలేదు.

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది.

‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా. అప్పటికే ప్రజాకవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గొప్ప పేరుంది. ఆయన ముందు ధైర్యం చేసి నేను రాసిన ఒక కవితను చదివాను. దానికి కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తు ఉంది.’ అని అన్నారు తెలుగు కవయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం–2025కు ఎంపిక చేసిన నేపథ్యంలో నేడు (మంగళవారం) కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే ఆమె చేసిన రచనలు, రాసిన కథలు.. గీసిన కార్టూన్లు, కాళోజీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. – సాక్షిప్రతినిధి, వరంగల్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌

విద్యార్థి దశనుంచే రచనలు..

అమ్మ ప్రోత్సాహం, భర్త సహకారం..

1980లో తొమ్మిదో తరగతిలో స్నేహ అనే నాటిక రాశాను. అనంతరం మొదటగా బుజ్జాయి అనే పిల్లల పత్రికలో నేను రాసిన కథను ప్రచురించారు. ఈ తరం అమ్మాయి అనే కథను ఒక మహిళా మ్యాగ్జిన్‌కు వాడుకున్నారు. నా చిన్నప్పటినుంచే మా అమ్మ శకుంతలాదేవి కథల పుస్తకాలు బాగా చదివేది. మాకు కథలు చెప్పేది. అలా కథల పుస్తకాలు చదువుతూ నేను కూడా కథలు రాయాలనుకున్నా. నన్ను మొదట ప్రోత్సహించింది మా అమ్మనే. అదేవిధంగా 1983లో వివాహం జరిగింది. భర్త దేవేందర్‌ జిల్లా కోఆపరేటిట్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసేవారు. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. కథలు, రచనలకు, కార్టూన్‌లకు తన అభిప్రాయాలు, సూచనలు చేసేవారు. అయితే దురదృష్టవశాత్తు 2009లో ఆయన హఠాన్మరణం చెందడం బాధాకరం.

కాళోజీని చాలాసార్లు కలిసి మాట్లాడాను..

నాతో కలిసి హనుమకొండలో బ్యాంకులో పనిచేసే రవికుమార్‌ కాళోజీ కుమారుడని తర్వాత తెలిసింది. రవికుమార్‌ పద్యాలు రాసేవారు. ఇద్దరం కవితలు, పద్యాలు ఒకరికొకరం చెప్పుకునేవాళ్లం. అతడితో కలిసి కాళోజీ ఇంటికి వెళ్లి ఆ మహానుభావుడితో చాలాసార్లు మాట్లాడాను. కాళోజీకి నేను రాసిన కథలు, రచనలు చూపించి సంతోషపడ్డాను. అనంతరం రెండు, మూడు సమావేశాల్లో కలుసుకున్నాం. కాళోజీ రచనలు చాలా చదివాను. ఆయన రచనలు సరళంగా, వ్యంగ్యంగా ఉంటాయి. సమాజాన్ని సూటిగా ప్రశ్నించే ఆయన రచనలు అంటే చాలా ఇష్టం.

ఆయన ధిక్కార స్వరం.. సమాజానికి దిక్సూచి..

ఒక మనిషి, కవి, రచయిత ఎలా ఉండాలని సమాజానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా పాటించిన గొప్పవ్యక్తి కాళోజీ. ఆయన రాసిన పలుకుబడుల భాష–బడిపలుకుల భాషతోపాటు పలు రచనలు చదివాను. ధిక్కార స్వరం అయిన కాళోజీ తెలంగాణకే కాదు మొత్తం సమాజానికి దిక్సూచి. ఆయన ఏదైనా పద్యం చెబితే వాస్తవికంగా, సరళంగా ఉండేది. రచనలు, మాటలు సూటిగా, చురుకుమనిపించేలా ఉంటాయి. ఆయన పోయట్రీ తెలంగాణకు దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటున్నామంటే ఆరోజుల్లోనే తెలంగాణ గురించి మాట్లాడి, కొట్లాడిన వ్యక్తి కాళోజీ ఒకధీరోదత్తుడు.

సీరియస్‌, హాస్యం.. రెండూ ఉంటాయి..

కాళోజీ మంచి జోకులు వేసేవారు. ఒక సమావేశంలో ఆయనను కలిసినప్పుడు బ్యాంకు క్యాషియర్‌నైన నన్ను కేవలం పైసలు లెక్కపెడ్తున్నావా? రచనలు చేస్తున్నావా? అంటూ హాస్యంగా మాట్లాడారు. రచయితలు రచనలు చేయాలని, సమాజానికి దిశానిర్దేశం చేసేలా, ప్రజలను చైతన్యం చేసేలా రచనలు ఉండాలని చెప్పేవారు.

కాళోజీ పురస్కారం...

మొదటి మహిళగా సంతోషంగా ఉంది..

గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కాళోజీ సాహితీ పురస్కారానికి ఈ ఏడాది మొదటి మహిళగా నేను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2015లో అమ్మంగి వేణుగోపాల్‌ ఈ అవార్డుకు ఎంపిక కాగా, అనంతరం గోరటి వెంకన్న తదితర ప్రముఖులు అందుకున్నారు. గత ఏడాది నలిమెల భాస్కర్‌కు ఈ అవార్డు అందించారు. 11వ వ్యక్తిగా మొదటి మహిళగా, కాళోజీ పుట్టిన ఓరుగల్లు బిడ్డగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది.

నేను రాసి, చదివిన కవిత బాగుందని మెచ్చుకోవడం మరిచిపోలేని గుర్తు

ఆయన పేరిట సాహితీ పురస్కారానికి ఎంపికై నందుకు సంతోషంగా ఉంది..

అమ్మ ప్రోత్సాహంతో రచనలు.. భర్త సహకారం కొనసాగించేలా చేశాయి..

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కాళోజీ సాహితీ పురస్కారం–2025 గ్రహీత నెల్లుట్ల రమాదేవి

బహుముఖ ప్రజ్ఞాశాలి.. రమాదేవి

నెల్లుట్ల రమాదేవి... తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ రైతు కుటుంబానికి చెందిన రాంచందర్‌రావు, శకుంతలా దేవి దంపతులకు జన్మించారు. 1983లో దేవేందర్‌ను వివాహమాడిన ఆమె 1984లో గ్రామీణ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రాబ్యాంకు సీనియర్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత్రి, కార్టూనిస్టుగా రాణించిన రమాదేవి మొదటి కార్టూన్‌ 1978లో స్వాతిలో అచ్చయ్యింది. ఆ తర్వాత అనేక కథలు, కథానికలు ఆమెకు మంచి గుర్తింపు తేగా.. 2013 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తిపురస్కారం అందుకున్నారు. కథలు, కవిత్వమే కాకుండా కార్టూన్లు వేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా రమణీయమైన కావ్యాలు, మనసుకు హత్తుకునే భాషతో అందరినీ ఆకట్టుకున్న రమాదేవి కాళోజీ సాహితీ పురస్కారం –2025కు ఎంపికయ్యారు.

మొదటి ప్రశంస కాళోజీదే1
1/3

మొదటి ప్రశంస కాళోజీదే

మొదటి ప్రశంస కాళోజీదే2
2/3

మొదటి ప్రశంస కాళోజీదే

మొదటి ప్రశంస కాళోజీదే3
3/3

మొదటి ప్రశంస కాళోజీదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement