రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ప్రభుత్వ విప్‌

Sep 9 2025 1:04 PM | Updated on Sep 9 2025 2:10 PM

దంతాలపల్లి: రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్‌లో భవిత్‌ భవన్‌, మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా పాఠశాల ఆవరణలో భవిత భవన్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. 

అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో ప్రభుత్వ విప్‌ పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ, ఎంఈఓ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు వేణుమాధవరెడ్డి, కృష్ణయ్య, కిషన్‌నాయక్‌, ఏఎంసీ వైస్‌ చెర్మన్‌ బట్టు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పండిట్‌ పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పండిట్‌ పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సోమవారం గిరిజన సంక్షేమశాఖ డీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయాలని, సీఆర్టీల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో గార్ల మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్‌ బాలాజీ, సభ్యులు బాలు, రాజు తదితరులు పాల్గొన్నారు.

28న జిల్లాస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు

డోర్నకల్‌: డోర్నకల్‌లో ఈనెల 28న జిల్లాస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.దేవ్‌సింగ్‌, బుట్టి అశోక్‌కుమార్‌ తెలి పారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. డోర్నకల్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ వ్యాయామశాల ఆధ్యర్యంలో 28న స్థానిక జైన్‌భవన్‌లో జిల్లాస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీ్త్ర, పురుషులకు సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు టీం చాంపియన్‌తో పాటు స్ట్రాంగ్‌మెన్‌ టైటిల్‌ అందించనున్నట్లు తెలిపారు.

నిధులు విడుదల చేయాలి

మహబూబాబాద్‌: పెండింగ్‌లో ఉన్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ స్కీం నిధులు విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా నిధులు పెండింగ్‌లో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. నిధులు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహేష్‌కుమార్‌, షబ్బీర్‌, చరణ్‌ పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

బయ్యారం: వ్యవసాయ మోటారు వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని బంజరతండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్‌ కుమార్‌(27) తన వ్యవసాయ మోటారు ఆఫ్‌ చేసేందుకు సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురైన ఆయన వరి పొలంలో పడిపోయాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి అచూకీ కోసం పొలం వద్దకు వెళ్లారు. కాగా మోటారు దగ్గర చలనం లేకుండా పడిపోయి ఉండగా.. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా కుమార్‌ అప్పటికే మృతి చెందాడు.

రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం1
1/1

రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement