
పర్యవేక్షించిన ఎస్పీ
మహబూబాబాద్ రూరల్/కురవి/మరిపెడ : మానుకోట పీఏసీఎస్ వద్ద ఆదివారం పేర్లు నమోదు చేసిన వారిలో 444 మంది రైతులకు సోమవారం ఒక్కొక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు స్టాక్ వచ్చిన పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు పరిశీలించి ఎంఏఓ పేరిట సీరియల్ నంబర్లు, స్టాంపులు వేసి పంపించారు. శనిగపురం గ్రామంలోని పీఏసీఎస్ సెల్ పాయింట్ వద్ద ఆదివారం పేర్లు నమోదు చేయించుకున్న రైతులు యూరియా కోసం సోమవారం తెల్లవారుజాము వరకు చేరుకున్నారు. అయితే యూరియా రావడం లేదని వ్యవసాయ అధికారులు చెప్పగానే వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి సముదాయించారు. ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యూరియా స్టాకురాగానే మంగళవారం పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. అదే విధంగా కురవి, మరిపెడ మండలాల్లో యూరియా పంపిణీ ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో సీఐలు మహేందర్ రెడ్డ్డి, సర్వయ్య, చంద్రమౌళి, రవికుమార్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్, గణేష్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. డీఏఓ విజయనిర్మల ఆధ్వర్యంలో ఏడీఏ శ్రీనివాసరావు, విజయ్ చంద్ర, ఏఓలు, ఏఈఓలు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు పరిశీలించి యూరియా పంపిణీ చేశారు.